21, నవంబర్ 2010, ఆదివారం

ట్రాఫిక్ నియంత్రిస్తున్న ఆంద్ర కేసరి

ఈ రోజూ ఆదివారం మధ్యాహ్నం ఏదో పని ఉండి రింగ్ రోడ్ మీదకి వెళ్ళా ఎగ్జికుటివ్ క్లబ్ దగ్గర రోడ్ దాటి సాయిబాబా గుడి రోడ్ లోకి తిప్పే లోగా రోడ్ కుడి పక్క ట్రాఫిక్ పోలీసు గంభీరంగా నుంచొని కనపడ్డారు. నా కార్ పక్కనే ఉండటం వల్ల యధాలాపం గా ఆయన బాడ్జ్ వంక చూసా ఆంధ్ర కేసరి PC **** అని ఉంది. అయన పేరు ఆంధ్ర కేసరి ట. బాగుందే అనుకోని అయన వంక తేరిపార చూసి రోడ్ దాటి వెళ్ళిపోయా. ఆయనాకా పేరు పెట్టిన వాళ్ళ పెద్దలకు నమస్కారాలు తలచుకుంటూ.
అసలా పేరు పెట్టాలనే ఆలోచన ఎలా వాచ్చిందో అని కించిత్తు ఆశ్చర్యం కూడా వేసింది. మంచి దేశ భక్తి లేదా రాష్త్ర మంటే అభిమానం ఉన్న కుంటుంబం అన్న మాట అనుకున్నా. మా వూళ్ళో గాంధీలు, నెహ్రూలు, బోస్ లు , ఇంకామాట్లాడితే చదువు లేని సురేంద్రనాథ్ బెనర్జీలు , బిపిన్ చంద్ర పాలులు ఇంకా ఎక్కువ మాట్లాడితే పెట్టుబడిదారి మార్క్స్ లు స్టాలిన్ లు, లెనిన్ లు లాంటి పేరు చాలా సామాన్యం మరి వాళ్ళల్లో దేశ భక్తి నేతి బీరకాయో ? సిలోన్ కొబ్బరికాయో నాకు తెలీదు అందుకే ఈయన పేరు నాకు కొంచం ఆలోచింప చేసింది.ఒక గంట నా పనులు చూసుకొని ఆ రోడ్ లోనే మళ్ళీ వెనక్కి వచ్చా, ఆంధ్ర కేసరి గారు అక్కడే డ్యూటీ లో ఉన్నారు. సిగ్నల్ ఫ్రీ గా ఉన్నా నాకున్న అతి సాంఘిక తత్వం( అంటే ఏంటి అని అడక్కండి ముక్కు మొహం తెలియని వాళ్ళని సైతం బాగా చుట్టాలన్నట్లు మాట్లాడే నా నైజం కి ఇలా పేరు పెట్టుకున్నా) తో అయన పక్కనే నా వాహనం ఆపి మీ పేరు ఆంధ్ర కేసరి చాలా బాగుంది అన్నా. అయన వెంటనే పేరే కాదు నా నైజం కూడా అంతే అన్నారు. మా వాళ్ళు ఆ పేరు పెట్టినందుకు నేను ఆ పేరు నిలపెడుతున్నాను సర్ అన్నారు. నిజం గానా అన్నట్టు చూసా అయన వంక, నా చూపు లో భావం గ్రహించిన అయన " నిజమే సర్ మా వాళ్ళు ఆ పేరు పెట్టినందుకు నేను నిజం గానే ఆంధ్ర కేసరి గారి ధోరణి లోనే ఉద్యోగం చేస్తున్నా అన్నారు. అంటే పోలీసు ఉద్యోగం చాలా నిజాయితీ గా చేస్తున్నాను , అని సగర్వం గా మీదు మిక్కిలి స్థిరమైన స్వరం తో చాలా ఆత్మ విశ్వాసం తో చెప్పారు. అయన కళ్ళల్లో ఆ నిజాయితీ కనపడింది. అయన మాటల్లో ఆ విశ్వాసం, సమాజం పట్ల భాధ్యత, ఉద్యోగం మంటే గౌరవం కనపడ్డాయి. ఇవ్వన్ని వాస్తవాలు అని నేను నమ్ముతున్నా. డ్యూటీ లో ఉన్న అయన భుజం చుట్టూ చెయ్యేసి నడి రోడ్ మీద గట్టిగా ఆలింగనం చేసి నేనేం మాట్లాడానో నాకే గుర్తు లేదు అంత ఉద్వేగానికి లోనయ్యా. అయన కూడా చాలా సంభ్రమం గా ఉద్వేగం గా కనపడ్డారు , బహుశ ఆయన్ని ఇలా బహిరంగం గా ఒక అపరిచిత వ్యక్తి ఎలాంటి సందర్భం లేకుండా అభినందించి ఉండరు. ప్రజల నుంచి ఇలాంటి ప్రోత్సాహం , మెచ్చుకోలు కనపడితే అయన లాంటి నీతి మంతులైన ఉద్యోగులు పెరుగుతారేమో మనం ప్రయత్నిద్దాం.
అందుకే ఆయనకీ అయన లాంటి ఎందరో మహానుభావులకీ నా మల్లె పూదండ.
బంగారు కంచానికైనా గోడ చేర్పు కావాలి.....ఎంత నీతి మంతుడి కైనా గుర్తింపు కావాలి.

8 కామెంట్‌లు:

  1. నిజాయితీపరుడునని తనను తాను అంత ఆత్మ విశ్వాసంతో చెప్పుకున్న ఆ పోలీసుని మీరు అభినందించి చాలా మంచి పని చేసారు !

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి పని చేసారు. మీరన్నట్లు నిజాయితీగా పని చేసేవారికి గుర్తింపు అవసరం.

    రిప్లయితొలగించండి
  3. మంచి పని చేసారు మంచి ఐడియా ఇక నుంచి నేనూ ప్రయత్నం చేస్తా ఇలా మెచ్చుకోవటానికి

    రిప్లయితొలగించండి
  4. అబ్బే,పొరబడుతున్నారు,గుర్తింపు కోరకుండా,లేకుండా,అయాచితంగా
    తోచిన-నమ్మిన మంచి చేస్తున్నవారు,నూటికి ముప్ఫై మందైనా మన చుట్టూ
    ఉన్నారు.వారు టీవీలల్లో,ఫోటోల్లో,ఎగబడుతూ కనబడరు.
    వాళ్ళను గమనించి,గుర్తించటం మనకు ప్రాప్తం ఉండాలి.
    అలాంటి అదృష్టం మీకు,మీ ద్వారా పది మందికి కలిగిందనుకుంటున్నా.
    బంగారు కంచానికి గోడ చేర్పే ఉండాలని లేదండి,కింద స్టాండ్ అమర్చి పెట్టవచ్చు.
    అలాగే,బంగారం లాంటి ఆంద్ర కేసరి వంటి మనుషులు నేల మీద నిలబడి కనిపిస్తారు కాని,నేల వదిలి సాము చెయ్యరు.చక్కటి పోస్ట్.అభినందనలు.
    శ్రీదేవీ మురళీధర్

    రిప్లయితొలగించండి
  5. paridhi dati(naa-naku-nenu)..prapanchanni chustu..maku chupncha galugutunna mee mallepudanda gubhalimpulu..manasara aswadisthunnam..andhra kesarulu ..long live...

    రిప్లయితొలగించండి
  6. మీ మల్లెపూదండ ఉద్దేశ్యం బాగుంది మరిన్ని రాయండి

    రిప్లయితొలగించండి
  7. ఆంధ్ర కేసరిని అభినందిచిన మీ అందరికీ నా ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  8. Saran, The word "Khaki"first reminds police chap,a man with poorest image in khaki series,A jai jawan today involved,from war room leak to katchup ,goat colns in the services,in such poor hopeless situation he is raising sun,my rgards to him and sure he would get his slice of cake,god blss.

    రిప్లయితొలగించండి