తెలీయని వాళ్ళకోసం చెప్తున్నా మా బెజవాడ ని ఒక పక్క దుర్గమ్మ మరో పక్క మరియమ్మా' చెరో వైపూ కాస్కోని ఉన్నారు. దసరా రోజుల్లో ఎంత సందడో, క్రిస్టమస్ రోజు కానీ మేరీ మాత ఉత్శావాల్లో , కానీ మరే ఇతర క్రైస్తవ పర్వ దినాల్లో కానీ గుణదల మేరీ మాత గుడి దగ్గర అంతే కోలాహలం, సందడీ ఉంటాయి . బోలెడన్ని కొట్లు, లైటింగ్ ,జనం, రక రకాల వ్యక్తులతో కళ కళ లాడి పోతుంటుంది. అందులో పాలు పంచుకునేందుకే మా గ్యాంగ్ తో వెళ్లాను.
మంచి ఉత్స్తాహం తో గబా గబా గుణదల కొండ ఎక్కేసాం. అక్కడ మేరీ మాతను దర్శింకొని, మెల్లగా దిగి కింద ఉన్న చర్చ్ లో కాసేపు కూర్చుందామని వెళ్లాం. అక్కడా బోలెడంత హడావిడీ. బాల యేసు బొమ్మ పెట్టారు ముద్దుగా బొద్దుగా అమాయకంగా అప్పుడే పుట్టిన పసి పిల్లల లాగానే అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆ బొమ్మ నే చూస్తూ నుంచుంటే పక్కనే ఏదో పరిచయమున్న పరిమళం, పళని సుబ్రమణ్య స్వామి విభూతి సుగంధం మీరు ఆ సౌగంధ అనుభవించి ఉంటే నే చెప్పక్కర్లేదు, ఆ పరిమళం ఒక్క సారి చూడ గానే ఏదో గుళ్ళో ఉన్న పవిత్ర భావన కలిగిస్తుంది. ఎక్కడిదా అని పక్కకి తిరిగి చూస్తె నల్లని బట్టల్లో ముఖాన విభూది గంధం కుంకం బొట్లతో. మెడలో అయ్యప్ప మాల తో సాక్షాతూ అయ్యప్పే క్రీస్తుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికా అన్నట్లు అయ్యప్ప దీక్షలోని స్వామి.
స్వామి ప్రార్ధన అయ్యాక మెల్లగా అయన పక్కన చేరా .... మీ పేరేంటి ? మీకు ఇలా సర్వమత సమానాత్వం ( అక్బర్ కి పర మత సహనం ఉండేది ?? తప్పు మాటేమో మనకి అన్ని మతాలలో నమ్మకం ఉంటె అది పరమతం ఎలా అవుతుంది) భావన ఎలా కలిగింది అని విలేకరి లా అడిగా. ఆయన పేరు చేజెర్ల శ్రీను స్వామి. గవర్నర్ పేట పెద్దిబొట్ల వారి వీధి లో లో ఒక చిన్న వస్త్ర దుకాణం కమ్ టైలోరింగ్ షాప్ పేరు డిఎన్ఆర్ టెక్స్ టైల్స్ అని చెప్పారు. మొత్తం కుటుంబం వచ్చారు అయన మాత ( దీక్ష లో ఉన్నారు కాబట్టి భార్య అనలేదు) రెండేళ్ళ పిల్లతో సహా.
ఆమె కి కూడా అదే సంస్కారం అబ్బినట్లుంది చేతిలో స్వీట్ ప్యాకెట్ క్రిస్ట్ దగ్గర పెట్టి నలుగురికీ పంచారు. వాళ్ళ పాప చాలా అదృష్ట వంతురాలు అంతటి సంస్కార వంత మయిన తల్లి దండ్రులకి పుట్టి నందుకు. రాజకీయ లబ్ది కోసమో మరేదో ఆశించో మన నాయకులూ, సిని జీరోలు వేరే మత ప్రార్ధన స్తలాలకి వెళ్లి ఆ పుటోలు, లేదా క్లిప్పింగులూ టీవీల్లో చూపించుకున్నట్లు కాక, కేవలం ఆత్మ తృప్తి కై, దైవ భక్తి కై, తన కోసమే ఇలా అందరు దేవుళ్ళనీ కొలిచే అయన ముందు నిజం గా మోకరిల్లను.
పిల్లలకి టేబుల్ మానెర్స్, పబ్లిక్ బిహేవియారు, అంటూ మోడరన్ ఎటికేట్స్ మాత్రమే నేర్పే తల్లి దండ్రులూ, టీచర్లు ఇవి కూడా నేర్పితే బాగుండు.
అయన లాంటి నిరాడంబర భక్తుడికి నా అభినందన మల్లె పూదండ వేయటం లో నా స్వార్ధం కూడా ఉంది.
అయన కి నా మల్లె పూదండ వేస్తె అయ్యప్ప కి వేసినట్లే.
అందుకే సీనూ సామీ అందుకోండి నా మల్లె పూదండ.
మీరూ అభినందిస్తా నంటే అయన ఫోన్ నెంబర్ 8121758 *** ఆయన్ని అడిగి ఇష్టముంటే మిగతా నెంబర్ ఇస్తా. అందాకా అయన ఫోటో చూడండి.
నిజమైన భారతీయుడిని చూశానండి. నా తరుపునుండి స్వామి గారికి ఇంకొక పూలదండ.
రిప్లయితొలగించండిఇలాంటిది ఒక్క హిందువులకే సాధ్యం.ఒక్క క్రిష్టియన్నైనా దుర్గమ్మ సన్నిధిలో చూడగలుగుతామా?హిందూ ప్రసాదాన్నే ముట్టుకోరు ఇక హిందూ గుళ్ళలోనా!
రిప్లయితొలగించండి@రాజేంద్ర ప్రసాద్ తప్పక వేస్తా బ్లాగ్ లోకాదు స్వయం గా అయన నిజమైన భారతీయుడే కాదు, నిజమైన మానవుడు.
రిప్లయితొలగించండి@విజయ మోహన్ మీరు చెప్పినది అందరికీ వర్తించదు. తిరుపతి క్యూ లో చూడండి చాల మంది కాక పొయిన కొంత మంది హైందవేతరులు కనపడతారు. అలాగే షిర్డీ లో ఇతర గుళ్ళల్లో
ఒకటి నిజం !! మనిషి మత పరిధులు దాటి దేవుణ్ణి నమ్మాలంటే దురదృష్టం వెంటాడాలి . అది లేకుండా నమ్మాడంటే నమ్మాడంటే నిజమైన మానవుడు. నిజమైన దైవ భక్తుడు. ఎవరో కొంత మంది చిన్న బుద్దులు చూపారని విజ్ఞత కల మీరు అందరినీ అదే గాట కట్టకండి. క్రైస్తవాన్ని ఆరాధించండి క్రైస్తవులని కాదు. అలాగే మిగతా మతాల్నీ.
మీ లిపిలేని భాష బ్లాగ్, మల్లె పూదండ బ్లాగ్ రెండూ చదివా మత సామరస్యానికి మీరు పడు తున్న పాట్లు చూస్తె నవ్వొచ్చింది.
రిప్లయితొలగించండిమీ బ్లాగుల్లో మీరు ఎంత ఘోషించినా బయట వెనకబాటు తనం మాయదు. దళితుల్ని కించపరచటం మానరు. ఎందుకీ ప్రయాస ?
ఎలాగో ఒకలా మిమ్మల్ని నవ్వించా...... ధన్యుడ నైతిని ఓ రామా !!
రిప్లయితొలగించండినా రెండు బ్లాగు టపాలు మత సామరస్యానికి సంభందించినవే. అందులో దళిత వాదం ఇంచుకైననూ లేదు.
కాబట్టి క్షమించి ఒదిలేయండి.
ఇంకో మాట అరవై మూడు ఏళ్ళ క్రితం రెండు వందల ఏళ్ళు మనని బ్రిటిష్ వాళ్ళు క్రూరంగా పాలించారని ఇప్పుడు మన పిల్లలు బ్రిటన్ వెళ్లి చదువు కోవట్లేదా, ఉద్యోగాలు చెయ్యట్లేదా? వ్యాపారం చెయ్యట్లేదా ? ఇదీ అంతే దేశమ్ లోని అన్ని హిందూ దేవాలయాల్లోకి వెళ్ళటానికి ఏ దళితుడైన ఇబ్బందిపడితే చెప్పండి మీరూ నేను స్వయం గా వెళ్లి పరిష్కరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు:
విజయ మోహన్ గారు ప్రసాదము గురించి మీ బ్లాగ్ లోనే జవాబు ఇచ్చాను.హిందువులు అయిన (SC /ST ) లకు చాలా ఆలయాలలో ఇప్పటికి ఆలయ ప్రవేశము లేదు. దాని గురించి స్పందించరేమి.వ్రతాల (కొన్ని మాసాలలో ) సమయాలలో వాళ్ళను ముట్టు కోవడానికి కూడా ఇష్టపడరు. ఇళ్ళలోకి ప్రవేశము లేదే .మనము ప్రసాదము ఇచ్చినపుడే భాదపడుతున్నాము .మరి తోటి మనుష్యులైన వారు ఎన్ని రోజులు భాదపడాలి ? మనతో పాటుగా వాళ్ళను సమానంగా చూసినప్పుడు అప్పుడు మనుషులుగా గర్వపడుదాము మతంగా కాదు.
రిప్లయితొలగించండిoka adugu mundu keste nalugadugulu venakki lage disscussion lu chustunte badhaga vundi...ilanti chakkani pryatanni..dani venuka vunna spoorthi ni ardham chsukondi...mallepudanda suvasanalu bahu madhuram..
రిప్లయితొలగించండిసర్వరూపాలు నావే అని భగవంతుని వచనాన్ని సంపుర్ణంగా నమ్మే శిక్షణ తల్లిపాలతో పాటేవస్తుంది హిందువులకు. అందుకే తనకిష్టమున్నా లేకున్నా ఏ భగవత్ రూపాన్నిగానీ సద్గురురూపాన్నిగానీ కించపరచడు . ఇక ఆచార కాండను అర్ధం చేసుకునే వారికి అంతా మామూలుగానే కనిపిస్తుంది. అర్ధం పర్ధంలేకుండా ఉండే అతి స్వల్పసంఖ్యాకుల ను ఉదాహరణగా చూపి ధర్మం మీద బురదజల్లటమే గొప్పగాభావిమ్చేవారు వారి ఆనందాన్ని వారు పొందుతుంటారు. అది దైవద్ర్రోహం ఆత్మవంచన అనితెలియక.
రిప్లయితొలగించండిదర్గాలు .చర్చీలు లాంటి నిర్మానాలలో తప్పనిసరిగా హిందువుల ఆర్ధికసహాయం ఉంటుంది . అక్కడకువెళ్ళి ఆరాధనలు చేయటం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా లేదా మతాచార్యులైనా అక్కడకెళ్లకూడదు ఇక్కడకెళ్లకూడదని చెప్పినా హిందువు వినడు. తర్కంగా ఆలోచిమ్చే జ్ఞానం ఉంటుంది. ఇక విగ్రహారాధకులంటూ తనను అవహేళన చేసినా వాల్లనుకూడా గుణదలలో ,సాగర్ లాంటిచోట్ల మీరుచేసేదేమని ,ఏసుతప్ప మిగతాదేవతలులేరనేవారికి ఇది బహుదేవతారాధన కాదా అనిగాని ప్రశ్నవేయడు . వారి మానసిక స్థాయిని తలచుకుని లోలోన నవ్వుకుంటూ తన నమస్కారం తాను చేసుకుంతాడు అంతే. ఇది తల్లిపాలతో రావాలి .అటువంటి ధర్మంలో పుట్టిపెరుగుతున్నందుకు గర్విస్తూ . సోదరుడు అయ్యప్పమాలాధారికి ,క్రీస్తుసద్గురువులను అనుసరిస్తున్న గురుబమ్ధువులందరకూ శుభాకాంక్షలు
Saran, Our's is a secular state,either it is branded or pure secular still we are unable to decide even after 63 years of independence, when we talk about unity and integrity with other communities every hindu in hindustan should question him self about the integrity with in his own community,still we distance the people on the name cast or creed,the "Buhai" temple in the form lotus is the place where one has to constitute his own god and pray,the mother of mothers is late mother Therissa,father of our missile technology is Kalam sab,the man behind our excellent progress is sardarji, nothing limited to one community,we are far more better in our out look when we compare with past still change has to come let pray Ram, raheem, jessus,I am sorry to say you used word "vasana" next to Swami please edit it to word "primalam" asit sound's bit crude next to swami,god blss. us
రిప్లయితొలగించండిThanks to All. and splly the anonymous:I appreciate your able comment with real stuff over the issue. but the later two comments( which i guess were from you) are aiming at personals. I invite or anticipate healthy discussion on the point, to make others to think and fallow, but not to humiliate or hurt the feelings, hence i aborted your earlier comments too.. knowledge over different subjects, command over languages are both like Atomic Invention if used properly they are boons to mankind. if used as "Little Boy" on Hiroshima you know the results i need not tell. I love Thomas Edison rather than Albert Einstein. God Bless All.
రిప్లయితొలగించండిaa kutumbame chala adhyathmikatha tho unna varila unnaru asalu ayyappa deekhsha lo church ki ravadam chala vinthaganu adarsa prayam gaanu undi
రిప్లయితొలగించండిathani jeevitham and kutumbam antha dhanyosmi.
vaarini darsimpa chesina meeru kooda dhanyosmi.
inka aayanani choosi yesu prabhuvu + ayyappa swamini dasrinchina punyam mari maalanti blog readersdi. grt.
thnks andi.
WOW
రిప్లయితొలగించండిnisanga Quesclamation?!
మనకి అన్ని మతాలలో నమ్మకం ఉంటె అది పరమతం ఎలా అవుతుంది
superb feel
Really Heart touching Sir,
I know this last Christmas post,
But this is my 1st Christmas in my blogging world.
Thanks
?!