6, నవంబర్ 2010, శనివారం

ఆయనకి వంట వచ్చు


మల్లె పూదండ అనే శీర్షిక తో నా బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు నాకు ఈయన గురించి తెలీదు.
ఆయనకు వంట బాగా వచ్చుట, నాకు వంట వచ్చిన మగాళ్లంటే ఇష్టం కారణం నాక్కోడా రావటమే కాదు.
వంట రావటమంటే చాల ఓపిక ఒద్దిక ఉన్న వాళ్ళని నా అభిప్రాయం, అందుకే ఆడాళ్ళకి అవి రెండు ఎక్కువ అంటారు.
ప్రపంచవ్యాప్తం గా ఎక్కువ ఆడాళ్ళే వంట చేస్తారు కాబట్టి ఆ రెండు వాళ్ళకే ఉన్నాయని నమ్ముతున్నా.
అంతే కాదు వంట రావటమంటే సృజనాత్మికత ఉన్నట్టు అలాగే ప్రేమించే గుణం కూడ బాగా ఉన్నట్టే. సరే మగాళ్ళలో వంట వస్తే ఈ గుణాలన్నీ ఉంటాయా..?
ఈ లక్షణాలన్నీ వంట చేసే వాళ్ళందరికీ ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ ఒకాయన ఉన్నారు.పేరు నారాయణన్ కృష్ణన్
మదురై లో ఉన్న ఈ 28 ఏళ్ళ యువకుడు హోటల్ మానేజ్మెంట్ & పాక శాస్త్రం లో చాలా ఖర్చు పెట్టి చదువు కుని 2002 లో స్విట్జెర్లాండ్ లో మంచి ఉద్యోగం సంపాదించి విమానం ఎక్కే ముందు ఒకసారి ఇంటికెళ్ళి అమ్మ నాన్న లను చూసి వెళ్దామని వచ్చి అక్కడున్న రెండు రోజులలో తన జీవితాన్నే మలుపు తిప్పే మరియు ఎందరికో ఆదర్శవంత మయ్యే నిర్ణయం తీస్కున్నారు.
ఆ నిర్ణయానికి దారి తీసిన పరిస్తితులేంటంటే రోడ్ మీద దిక్కు లేని, కూడు గుడ్డ గూడు కు నోచుకోని అనాధల పోషణ.
ఎవరూ లేని ఉన్నా పట్టించుకోని మానసిక వ్యాధి గ్రస్తులు , ఇంకా రోగపీడితులు, శాప గ్రస్తులు ఆయినా వేలాది జనం ( మదురై లో అంతకన్నా ఎక్కువ మంది ఉంటారని అనుకోను).
అలాంటి వేలాది మంది దీనులలో ఒక మానసిక రోగి ని, ఆకలి కి తట్టుకోలేక లేక మతి బ్రమణం లోనో తన మలాన్నే తాను తింటున్న ( సభ్య నాగరిక ప్రజలారా నేను విన్నదానిని బట్టి ఇది రాసాను) వ్యక్తి ని నారాయణన్ కృష్ణన్ చూసారు. చూసాక ఎక్కువ మంది చేసే పని జుగుప్స్త తో తల తిప్పుకోలేదు, కొంత మందిలా జేబులో డబ్బులిచ్చి ఎమన్నా తిను అని చెప్పి వెళ్లి పోలేదు. ఆ వ్యక్తి కి ఆహారం ఇచ్చారు ఇచ్చాక అయన చేయి ఆ అనాధ పట్టుకున్నారు . ఆ సంఘటన లో ఆ ముదుసలి కి ఆహారం అందిచ్చిన తర్వాత ఆయన తన చేతి ని పట్టుకున్న స్పర్శ నారాయణన్ కు అమిత మైన స్పూర్తిని ,శక్తీ ని ఇచ్చిందిట. దాని తర్వాత అయన తీసుకున్న నిర్ణయం మాత్రం అత్యంత ఖరీదైనది.
స్విట్జెర్లాండ్ లో నివసించటానికి వచ్చిన విలాస వంత మైన జీవితం, లాభసాటి జీతం, ప్రపంచం లోనే అత్యంత సౌందర్య భరిత ఆగోగ్య వాతావరణం అన్నీ వదిలేసి ఇక్కడే మదురై లో ఒక అనాధ శరణాలయం నడప టానికి స్థిరపడ్డారు. జూన్ 2002 లో అయన స్థాపించిన అక్షయ ట్రస్ట్ ఎంతో మంది అన్నార్తులకు కడుపు నింపుతోంది.
అనాధలకు ,రోగ గ్రస్తులకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయటం. ప్రతి దినము కొన్ని వందల మందికి కడుపు నిండా భోజనం పెట్టటం ఆ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం.
ప్రతి ఉదయం నాలుగు గంటలకు మొదలయ్యే అయన దిన చర్య .. దీనుల కు ఆహారం అందిచ్చటమే కాక స్నానం చేయించటం, శుబ్రమైన వస్త్రాలను అమర్చటం వంటి పనుల తో రాత్రి పూర్తి అవుతుంది.
ఉత్తుత్తి ఫైట్లు చేసే మన సినిమా హీరో ల కన్నా, స్వార్ధ సేవలు చేసే నాయకుల కన్నా, బాగా సంపాదించి ఆనక పేరు కోసం ప్రజాసేవ చేసే మన సినీ నాయకుల కన్నా నాకు ఈ హీరో చాలా అందంగా కనపడుతున్నాడు.
చదివితే సిద్ధార్ధుడు గౌతమ బుద్దుని గా మారిన వైనం గా ఉన్న నారాయణన్ కృష్ణన్ ఉదంతం మన అందరికీ ఎంతో ఆదర్శం. మనం చేస్తున్నా పనులు మానేసి అయనలా చెయ్యలేక పోయినా, ఆయనంత త్యాగ గుణం మనకు లేక పోయినా అయన లాంటి వాళ్లకు తోచిన సాయమందిస్తే మనకూ ఎంతో కొంత పుణ్య ఫలం తృప్తి కలుగుతాయని నా నమ్మకం.
అందుకే నా మొదటి మల్లె పూదండ నారాయణన్ కృష్ణన్ గారికి.
అయన చిరునామా
Akshaya's Helping in H.E.L.P. Trust
9, West 1st Main Street, Doak Nagar Extension,
Madurai 625 010. India
Ph: +91(0)452 4353439/2587104
Cell:+91 98433 19933.
email : ramdost@sancharnet.in

www.akshayatrust.org
ఆయన గురించి మాకు బానే తెలుసు నువ్వు చెప్పేదేంటి అంటున్నారా నా మల్లె పూదండ నే వేస్తేనే నాకు తృప్తి.

7 కామెంట్‌లు:

  1. mee modatidandaki naa joharlu
    ee madhyane vinna no chadiveno eeyana gurinchi but koddiga telusu. but nijamga alanti vallaki chethulethi namaskaram pedthunna. endukante
    mana manushalaki manam cheyyadame pedda upakaram chesthunna feeling vasthunna ee rojullo
    inthati sahayam chala arudaina vishayam. deenini maa mundunchinanduku meeku kooda maa mallipoodanda.

    రిప్లయితొలగించండి
  2. మానవత్వ పరిమళాలను ఈ బ్లాగ్ ద్వారా ప్రసరింపజేసే ప్రయత్నం చేయడం అభినందనీయం. అనాధ శరణాలయం నడపడం అంటే మాటలు కాదు. ఎంతో కార్యదీక్ష కావాలి. ఉడతా భక్తి గా ఎంతో కొంత సహాయం చెయ్యడం మన విధి అని నా భావన.. ఆత్రేయ గారూ .. మీరు మరింత మందిని ఇలా మాకు పరిచయం చేస్తారని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. ఇంకొక్క మాట.. అన్ని దానాల్లోకీ అన్న దానం గొప్పది అని పెద్ద వాళ్ళు చెప్పగా విన్నాను. ఎందుకంటే విద్య, వస్త్రము, సువర్ణం etc లు ఎన్ని ఉన్నా , ఇంకా ఉంటే బావుణ్ణు అన్న తృష్ణ ఉంటుంది.. కానీ , అన్నం విషయం లో కడుపు నిండంగానే " ఇంకా చాల్రా బాబూ " అనిపిస్తుంది. అవతల వాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టేక వాళ్ళ కళ్ళలో ఉన్న తృప్తి వెలకట్టలేనిది. "మానవ సేవే మాధవ సేవ"..

    రిప్లయితొలగించండి
  4. its a good attempt to praise these people

    congrates and thanks for giving his contact

    details

    రిప్లయితొలగించండి
  5. Saran,Let me praise you first to bring this grate man to lime light,it needs a self less commitment to take up these projects,"Endaro mahanu bhavulu,Andarik vandanamulu" eeyanaki chetulu letti namaskaristunnanu, My god bless him with some energy to start new projects for needy and deserving people.

    రిప్లయితొలగించండి