10, నవంబర్ 2010, బుధవారం

ఆ ఆదిలాబాద్ స్త్రీ ..

నా రెండవ దండ రెండు రోజుల క్రితమే వెయ్యాల్సి ఉంది ...
8 తేదీ ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ యధాలాపం గా టీవీ వార్తల మీద ఒక చెవి వేసి ఉంచి నప్పుడు కేవలం పదిక్షణాల వార్త
ఆదిలాబాద్ లో ఒక సాధారణ మహిళా తనకు దొరికిన లక్షరూపాయలు పోగొట్టుకొనిన వ్యక్తి కి తిరిగి అందేలా చేసింది. ఆమె ను కూడా టీవీ లో చూపారు కానీ కేవలం పది క్షణాల వార్త మాత్రమే.
ఆమె ను ఛానల్ వారు అభినందించారు పొగిడారు. కానీ హడావిడిగా చూపిన వార్తలో ఆమె పేరు వివరాలు నాకుఅందేలోపు అయిపొయింది. ఆదిలాబాద్ లో మహిళ పూర్తి వివరాలు మరుసటి రోజూ పేపర్లలో గానీ లేక టీవీ లో గానీమళ్ళీ రాలేదు.
ఎంతో సామాన్యం గా కనపడ్డ ఆమె వ్యక్తిత్వ పరం గా ఎంతో ఉన్నతం గా అగుపించింది . అందుకే
మల్లె పూదండ
బ్లాగ్ టపా ద్వారా ఆమెని మనసారా అభినందిస్తున్నా..
టపా ద్వారా ఆమె లాంటి వాళ్ళు ఎంతో మందికి స్ఫూర్తి గా నిలవాలి.
ముఖ్యం గా పెళ్ళాం ఒంటిమీద నగలు అమర్చటానికో, పిల్లలను విలాసవంతం గా పెంచటానికి, మూడు తరాలా వరకూముందు చూపు తో ఆస్తి సంపాదించటానికి ఆరాట పడుతూ క్రమం లో వచ్చే జీతం చాలక ఉద్యోగం హోదా అడ్డు పెట్టుకుని గడ్డి తినే వెధవలకు, ఆమె లాంటి వాళ్ళు ఆదర్శం కావాలి.
మరింత ముఖ్యం గా లంచాల డబ్బులతో జల్సాలు చేస్తూ నిజాయితీ గా ఉండే వాళ్ళ ఆర్ధిక స్థితి ని హేళన చేసే జలగలుతెలుసు కోవాల్సినది " లంచాల సొమ్ము కన్నా నాలుగు రోడ్ల కూడలి లో మాడే కడుపుకి నాలుగు మెతుకుల కైనుంచునే వాళ్ళ సంపాదనే ఉత్తమం".
అక్రమ సంపాదన కోసం వెంపర్లాడే వెధలంతా ఆదిలాబాద్ స్త్రీ కాళ్ళు కడిగి నీళ్ళు తాగితే బుద్ధి వస్తుందేమోప్రయత్నించండి.

సినిమా వాళ్ల ఫలానా హీరో బామ్మర్ది గుట్కా వేస్కున్నాడు, ఇంకెవడి తమ్ముడో గంజాయి దమ్ము లాగాడు, ఫలానాహీరోయిన్ నాలుగో పెళ్లి ఐదో మొగాడితో లాంటి వార్తలు రోజంతా ప్రసారం చేసే టీవీ ఛానళ్ళు ఇలాంటి నీతివంతుల వార్తలు పెద్ద ఇష్టం గా ఎక్కువ సేపు చూపవు. అది వాళ్ల ఇష్టం లెండి మనమేమీ చేయలేము.

నేను మాత్రం నే వార్తల్లో చూసిన అదిలాబాద్ స్త్రీకి జేజేలు చెప్తూ, మీ సాక్షిగా మనసారా అభినందన మల్లె పూదండ వేస్తున్నా...
ఆమె, ఆమె కుటుంబం అభివృధి లోకి రావాలని కోరుకుంటూ....
విన్నపం : మీలో ఎవరికైనా ఆమె వివరాలు తెలిస్తే నాకు తెలియ పరచండి ఈ టపా ని సవరించి రాస్తా. మీకు థాంక్స్ కూడచెప్తా.


8 కామెంట్‌లు:

  1. unbelievable, Hats-off to that lady, i think god came in her form, to create a thought of change in human brain. Great news

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటి మంచి విషయం పంచుకున్నందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. ఓబుల్ రెడ్డి11 నవంబర్, 2010 10:05 AMకి

    మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉంటారు. పేదైన ప్రతివాడూ దొంగ కాడు. ధనికుడైన ప్రతివాడూ దొర కాడు. గత నెలలో హైదరాబాదులో రాములు నాయక్ అనే ఆటో డ్రైవర్ తన బండిలో మర్చిపోయిన పదిలక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరాణల సూట్‌కేసుని భద్రంగా తీసుకెళ్ళి దాని యజమానులకు అప్పగించాడు.

    రిప్లయితొలగించండి
  4. Telangana vallaku idi normal.
    Seemandhra vallaku idi unbelievable.

    రిప్లయితొలగించండి
  5. అవును ఇది ఆదిలాబాద్ లో జరిగింది అంటే నమ్మ సఖ్యం కాలేదు..... ఆంధ్రా లో అంటే నమ్మచ్చు

    రిప్లయితొలగించండి
  6. దయచేసి నా టపా టీవీ ఛానల్ కాదు, కాబట్టి ఈ రకమైన చర్చ / వాదోపవాదాలు చెయ్యొద్దు కేవలం సభ్యత కోసం పైరెండు వ్యాఖ్యలు ప్రచురించా..

    రిప్లయితొలగించండి
  7. Saran,Honesty,loyalty or any qualities of this kind there is no regional or territorial limits,let us come forward "endaro mahanu bhavulu" variloni ee animutyaniki abhinandanalu.

    రిప్లయితొలగించండి