ఈ రోజూ ఆదివారం మధ్యాహ్నం ఏదో పని ఉండి రింగ్ రోడ్ మీదకి వెళ్ళా ఎగ్జికుటివ్ క్లబ్ దగ్గర రోడ్ దాటి సాయిబాబా గుడి రోడ్ లోకి తిప్పే లోగా రోడ్ కుడి పక్క ట్రాఫిక్ పోలీసు గంభీరంగా నుంచొని కనపడ్డారు. నా కార్ పక్కనే ఉండటం వల్ల యధాలాపం గా ఆయన బాడ్జ్ వంక చూసా ఆంధ్ర కేసరి PC **** అని ఉంది. అయన పేరు ఆంధ్ర కేసరి ట. బాగుందే అనుకోని అయన వంక తేరిపార చూసి రోడ్ దాటి వెళ్ళిపోయా. ఆయనాకా పేరు పెట్టిన వాళ్ళ పెద్దలకు నమస్కారాలు తలచుకుంటూ.
అసలా పేరు పెట్టాలనే ఆలోచన ఎలా వాచ్చిందో అని కించిత్తు ఆశ్చర్యం కూడా వేసింది. మంచి దేశ భక్తి లేదా రాష్త్ర మంటే అభిమానం ఉన్న కుంటుంబం అన్న మాట అనుకున్నా. మా వూళ్ళో గాంధీలు, నెహ్రూలు, బోస్ లు , ఇంకామాట్లాడితే చదువు లేని సురేంద్రనాథ్ బెనర్జీలు , బిపిన్ చంద్ర పాలులు ఇంకా ఎక్కువ మాట్లాడితే పెట్టుబడిదారి మార్క్స్ లు స్టాలిన్ లు, లెనిన్ లు లాంటి పేరు చాలా సామాన్యం మరి వాళ్ళల్లో దేశ భక్తి నేతి బీరకాయో ? సిలోన్ కొబ్బరికాయో నాకు తెలీదు అందుకే ఈయన పేరు నాకు కొంచం ఆలోచింప చేసింది.ఒక గంట నా పనులు చూసుకొని ఆ రోడ్ లోనే మళ్ళీ వెనక్కి వచ్చా, ఆంధ్ర కేసరి గారు అక్కడే డ్యూటీ లో ఉన్నారు. సిగ్నల్ ఫ్రీ గా ఉన్నా నాకున్న అతి సాంఘిక తత్వం( అంటే ఏంటి అని అడక్కండి ముక్కు మొహం తెలియని వాళ్ళని సైతం బాగా చుట్టాలన్నట్లు మాట్లాడే నా నైజం కి ఇలా పేరు పెట్టుకున్నా) తో అయన పక్కనే నా వాహనం ఆపి మీ పేరు ఆంధ్ర కేసరి చాలా బాగుంది అన్నా. అయన వెంటనే పేరే కాదు నా నైజం కూడా అంతే అన్నారు. మా వాళ్ళు ఆ పేరు పెట్టినందుకు నేను ఆ పేరు నిలపెడుతున్నాను సర్ అన్నారు. నిజం గానా అన్నట్టు చూసా అయన వంక, నా చూపు లో భావం గ్రహించిన అయన " నిజమే సర్ మా వాళ్ళు ఆ పేరు పెట్టినందుకు నేను నిజం గానే ఆంధ్ర కేసరి గారి ధోరణి లోనే ఉద్యోగం చేస్తున్నా అన్నారు. అంటే పోలీసు ఉద్యోగం చాలా నిజాయితీ గా చేస్తున్నాను , అని సగర్వం గా మీదు మిక్కిలి స్థిరమైన స్వరం తో చాలా ఆత్మ విశ్వాసం తో చెప్పారు. అయన కళ్ళల్లో ఆ నిజాయితీ కనపడింది. అయన మాటల్లో ఆ విశ్వాసం, సమాజం పట్ల భాధ్యత, ఉద్యోగం మంటే గౌరవం కనపడ్డాయి. ఇవ్వన్ని వాస్తవాలు అని నేను నమ్ముతున్నా. డ్యూటీ లో ఉన్న అయన భుజం చుట్టూ చెయ్యేసి నడి రోడ్ మీద గట్టిగా ఆలింగనం చేసి నేనేం మాట్లాడానో నాకే గుర్తు లేదు అంత ఉద్వేగానికి లోనయ్యా. అయన కూడా చాలా సంభ్రమం గా ఉద్వేగం గా కనపడ్డారు , బహుశ ఆయన్ని ఇలా బహిరంగం గా ఒక అపరిచిత వ్యక్తి ఎలాంటి సందర్భం లేకుండా అభినందించి ఉండరు. ప్రజల నుంచి ఇలాంటి ప్రోత్సాహం , మెచ్చుకోలు కనపడితే అయన లాంటి నీతి మంతులైన ఉద్యోగులు పెరుగుతారేమో మనం ప్రయత్నిద్దాం.
అందుకే ఆయనకీ అయన లాంటి ఎందరో మహానుభావులకీ నా మల్లె పూదండ.
బంగారు కంచానికైనా గోడ చేర్పు కావాలి.....ఎంత నీతి మంతుడి కైనా గుర్తింపు కావాలి.
21, నవంబర్ 2010, ఆదివారం
ట్రాఫిక్ నియంత్రిస్తున్న ఆంద్ర కేసరి
10, నవంబర్ 2010, బుధవారం
ఆ ఆదిలాబాద్ స్త్రీ ..
నా రెండవ దండ రెండు రోజుల క్రితమే వెయ్యాల్సి ఉంది ...
8 వ తేదీ ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ యధాలాపం గా టీవీ వార్తల మీద ఒక చెవి వేసి ఉంచి నప్పుడు కేవలం పదిక్షణాల వార్త
ఆదిలాబాద్ లో ఒక సాధారణ మహిళా తనకు దొరికిన లక్షరూపాయలు ఆ పోగొట్టుకొనిన వ్యక్తి కి తిరిగి అందేలా చేసింది. ఆమె ను కూడా టీవీ లో చూపారు కానీ కేవలం పది క్షణాల వార్త మాత్రమే.
ఆమె ను ఆ ఛానల్ వారు అభినందించారు పొగిడారు. కానీ హడావిడిగా చూపిన ఆ వార్తలో ఆమె పేరు వివరాలు నాకుఅందేలోపు అయిపొయింది. ఆదిలాబాద్ లో ఆ మహిళ పూర్తి వివరాలు మరుసటి రోజూ పేపర్లలో గానీ లేక టీవీ లో గానీమళ్ళీ రాలేదు.
ఎంతో సామాన్యం గా కనపడ్డ ఆమె వ్యక్తిత్వ పరం గా ఎంతో ఉన్నతం గా అగుపించింది . అందుకే ఈ
మల్లె పూదండ బ్లాగ్ టపా ద్వారా ఆమెని మనసారా అభినందిస్తున్నా..
ఈ టపా ద్వారా ఆమె లాంటి వాళ్ళు ఎంతో మందికి స్ఫూర్తి గా నిలవాలి.
ముఖ్యం గా పెళ్ళాం ఒంటిమీద నగలు అమర్చటానికో, పిల్లలను విలాసవంతం గా పెంచటానికి, మూడు తరాలా వరకూముందు చూపు తో ఆస్తి సంపాదించటానికి ఆరాట పడుతూ ఆ క్రమం లో వచ్చే జీతం చాలక ఉద్యోగం హోదా అడ్డు పెట్టుకుని గడ్డి తినే వెధవలకు, ఆమె లాంటి వాళ్ళు ఆదర్శం కావాలి.
మరింత ముఖ్యం గా లంచాల డబ్బులతో జల్సాలు చేస్తూ నిజాయితీ గా ఉండే వాళ్ళ ఆర్ధిక స్థితి ని హేళన చేసే జలగలుతెలుసు కోవాల్సినది " ఆ లంచాల సొమ్ము కన్నా నాలుగు రోడ్ల కూడలి లో మాడే కడుపుకి నాలుగు మెతుకుల కైనుంచునే వాళ్ళ సంపాదనే ఉత్తమం".
అక్రమ సంపాదన కోసం వెంపర్లాడే వెధలంతా ఆ ఆదిలాబాద్ స్త్రీ కాళ్ళు కడిగి నీళ్ళు తాగితే బుద్ధి వస్తుందేమోప్రయత్నించండి.
సినిమా వాళ్ల ఫలానా హీరో బామ్మర్ది గుట్కా వేస్కున్నాడు, ఇంకెవడి తమ్ముడో గంజాయి దమ్ము లాగాడు, ఫలానాహీరోయిన్ నాలుగో పెళ్లి ఐదో మొగాడితో లాంటి వార్తలు రోజంతా ప్రసారం చేసే టీవీ ఛానళ్ళు ఇలాంటి నీతివంతుల వార్తలు పెద్ద ఇష్టం గా ఎక్కువ సేపు చూపవు. అది వాళ్ల ఇష్టం లెండి మనమేమీ చేయలేము.
నేను మాత్రం నే వార్తల్లో చూసిన ఆ అదిలాబాద్ స్త్రీకి జేజేలు చెప్తూ, మీ సాక్షిగా మనసారా అభినందన మల్లె పూదండ వేస్తున్నా...
ఆమె, ఆమె కుటుంబం అభివృధి లోకి రావాలని కోరుకుంటూ....
విన్నపం : మీలో ఎవరికైనా ఆమె వివరాలు తెలిస్తే నాకు తెలియ పరచండి ఈ టపా ని సవరించి రాస్తా. మీకు థాంక్స్ కూడచెప్తా.

6, నవంబర్ 2010, శనివారం
ఆయనకి వంట వచ్చు
మల్లె పూదండ అనే శీర్షిక తో నా బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు నాకు ఈయన గురించి తెలీదు.
ఆయనకు వంట బాగా వచ్చుట, నాకు వంట వచ్చిన మగాళ్లంటే ఇష్టం కారణం నాక్కోడా రావటమే కాదు.
వంట రావటమంటే చాల ఓపిక ఒద్దిక ఉన్న వాళ్ళని నా అభిప్రాయం, అందుకే ఆడాళ్ళకి అవి రెండు ఎక్కువ అంటారు.
ప్రపంచవ్యాప్తం గా ఎక్కువ ఆడాళ్ళే వంట చేస్తారు కాబట్టి ఆ రెండు వాళ్ళకే ఉన్నాయని నమ్ముతున్నా.
అంతే కాదు వంట రావటమంటే సృజనాత్మికత ఉన్నట్టు అలాగే ప్రేమించే గుణం కూడ బాగా ఉన్నట్టే. సరే మగాళ్ళలో వంట వస్తే ఈ గుణాలన్నీ ఉంటాయా..?
ఈ లక్షణాలన్నీ వంట చేసే వాళ్ళందరికీ ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ ఒకాయన ఉన్నారు.పేరు నారాయణన్ కృష్ణన్
మదురై లో ఉన్న ఈ 28 ఏళ్ళ యువకుడు హోటల్ మానేజ్మెంట్ & పాక శాస్త్రం లో చాలా ఖర్చు పెట్టి చదువు కుని 2002 లో స్విట్జెర్లాండ్ లో మంచి ఉద్యోగం సంపాదించి విమానం ఎక్కే ముందు ఒకసారి ఇంటికెళ్ళి అమ్మ నాన్న లను చూసి వెళ్దామని వచ్చి అక్కడున్న రెండు రోజులలో తన జీవితాన్నే మలుపు తిప్పే మరియు ఎందరికో ఆదర్శవంత మయ్యే నిర్ణయం తీస్కున్నారు.
ఆ నిర్ణయానికి దారి తీసిన పరిస్తితులేంటంటే రోడ్ మీద దిక్కు లేని, కూడు గుడ్డ గూడు కు నోచుకోని అనాధల పోషణ.
ఎవరూ లేని ఉన్నా పట్టించుకోని మానసిక వ్యాధి గ్రస్తులు , ఇంకా రోగపీడితులు, శాప గ్రస్తులు ఆయినా వేలాది జనం ( మదురై లో అంతకన్నా ఎక్కువ మంది ఉంటారని అనుకోను).
అలాంటి వేలాది మంది దీనులలో ఒక మానసిక రోగి ని, ఆకలి కి తట్టుకోలేక లేక మతి బ్రమణం లోనో తన మలాన్నే తాను తింటున్న ( సభ్య నాగరిక ప్రజలారా నేను విన్నదానిని బట్టి ఇది రాసాను) వ్యక్తి ని నారాయణన్ కృష్ణన్ చూసారు. చూసాక ఎక్కువ మంది చేసే పని జుగుప్స్త తో తల తిప్పుకోలేదు, కొంత మందిలా జేబులో డబ్బులిచ్చి ఎమన్నా తిను అని చెప్పి వెళ్లి పోలేదు. ఆ వ్యక్తి కి ఆహారం ఇచ్చారు ఇచ్చాక అయన చేయి ఆ అనాధ పట్టుకున్నారు . ఆ సంఘటన లో ఆ ముదుసలి కి ఆహారం అందిచ్చిన తర్వాత ఆయన తన చేతి ని పట్టుకున్న స్పర్శ నారాయణన్ కు అమిత మైన స్పూర్తిని ,శక్తీ ని ఇచ్చిందిట. దాని తర్వాత అయన తీసుకున్న నిర్ణయం మాత్రం అత్యంత ఖరీదైనది.
స్విట్జెర్లాండ్ లో నివసించటానికి వచ్చిన విలాస వంత మైన జీవితం, లాభసాటి జీతం, ప్రపంచం లోనే అత్యంత సౌందర్య భరిత ఆగోగ్య వాతావరణం అన్నీ వదిలేసి ఇక్కడే మదురై లో ఒక అనాధ శరణాలయం నడప టానికి స్థిరపడ్డారు. జూన్ 2002 లో అయన స్థాపించిన అక్షయ ట్రస్ట్ ఎంతో మంది అన్నార్తులకు కడుపు నింపుతోంది.
అనాధలకు ,రోగ గ్రస్తులకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయటం. ప్రతి దినము కొన్ని వందల మందికి కడుపు నిండా భోజనం పెట్టటం ఆ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం.
ప్రతి ఉదయం నాలుగు గంటలకు మొదలయ్యే అయన దిన చర్య .. దీనుల కు ఆహారం అందిచ్చటమే కాక స్నానం చేయించటం, శుబ్రమైన వస్త్రాలను అమర్చటం వంటి పనుల తో రాత్రి పూర్తి అవుతుంది.
ఉత్తుత్తి ఫైట్లు చేసే మన సినిమా హీరో ల కన్నా, స్వార్ధ సేవలు చేసే నాయకుల కన్నా, బాగా సంపాదించి ఆనక పేరు కోసం ప్రజాసేవ చేసే మన సినీ నాయకుల కన్నా నాకు ఈ హీరో చాలా అందంగా కనపడుతున్నాడు.
చదివితే సిద్ధార్ధుడు గౌతమ బుద్దుని గా మారిన వైనం గా ఉన్న నారాయణన్ కృష్ణన్ ఉదంతం మన అందరికీ ఎంతో ఆదర్శం. మనం చేస్తున్నా పనులు మానేసి అయనలా చెయ్యలేక పోయినా, ఆయనంత త్యాగ గుణం మనకు లేక పోయినా అయన లాంటి వాళ్లకు తోచిన సాయమందిస్తే మనకూ ఎంతో కొంత పుణ్య ఫలం తృప్తి కలుగుతాయని నా నమ్మకం.
అందుకే నా మొదటి మల్లె పూదండ నారాయణన్ కృష్ణన్ గారికి.
అయన చిరునామా
Akshaya's Helping in H.E.L.P. Trust
9, West 1st Main Street, Doak Nagar Extension,
Madurai 625 010. India
Ph: +91(0)452 4353439/2587104
Cell:+91 98433 19933.
email : ramdost@sancharnet.in
www.akshayatrust.org
ఆయన గురించి మాకు బానే తెలుసు నువ్వు చెప్పేదేంటి అంటున్నారా నా మల్లె పూదండ నే వేస్తేనే నాకు తృప్తి.
5, నవంబర్ 2010, శుక్రవారం
ఎవరి కోసమీ మల్లెపూదండ....
మల్లె పూదండ అని పేరు పెట్టా గానీ, అది ఎవరికో ఎందుకో చెప్పలేదు
ఇప్పటి వరకు, కారణం బిజీ గా ఉండటం.
అసలు ఈ బ్లాగ్ మొదలు పెట్టిన ఉద్దేశ్యం ఈ మల్లె పూదండ ని అప్పుడప్పుడు ఎవరికన్నా వేయాలని
ఇదేమీ స్వయంవరం కాదు కానీ స్వయం గా మెచ్చుకోవటానికి వీలు లేని మనచుట్టూ ఉన్న వ్యక్తులకో,
వార్తల్లో వ్యక్తులకో ఎవరికన్నా వేయటానికే నా ఈ మల్లెపూదండ...
వివరం గా చెప్పాలంటే ఎవరన్నా మంచి పని చేసారన్న సంగతి తెలుసుకొని
వారిని అభినందించాలని అనిపించినా వ్యక్తి గతం గా చెప్ప లేనప్పుడు
ఈ బ్లాగ్ ద్వారా నా అభినందన మల్లె పూదండ వేస్తా నన్న మాట.
ఒక రకమైన తృప్తి కలిగించే ఈ చర్య మీ కందరికీ కూడ నచ్చుతుందని ఆశిస్తున్నా.
నా లిపి లేని భాష ను చదివి అర్ధం చేసుకున్నట్లే మల్లెపూదండను కూడా ఆఘ్రాణిస్తారా....??
ధన్యవాదములు
ఆత్రేయ

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)